Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు హైకోర్టు షాక్!

  • నకిలీ ఫోర్జరీ పత్రాలు, బెదిరింపుల కేసులో
  • విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశం
  • ఉత్తర్వులు జారీచేసిన ఉమ్మడి హైకోర్టు

టీడీపీ నేత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. ఉమా, ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది. తన స్థలానికి సంబంధించి నకిలీ, ఫోర్జరీ పత్రాలు తయారుచేయడంతో పాటు తనను బెదిరించారని రామిరెడ్డి కోటేశ్వరరావు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు విచారించిన కోర్టు.. ఎమ్మెల్యే, ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

Andhra Pradesh
Telugudesam
Bonda Uma
forgery
documents
duplicate
High Court
  • Loading...

More Telugu News