sabarimala: పోలీసులు మమ్మల్ని మధ్యలోనే వదిలేశారు: శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏపీ మహిళ మాధవి

  • కుటుంబంతో కలసి శబరిమల వెళ్లిన మహిళ
  • ఆలయం సమీపించిన సమయంలో వదిలేసి వెళ్లిన పోలీసులు
  • అడ్డుకున్న నిరసనకారులు

శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏపీ మహిళ మాధవికి నిరాశ ఎదురైంది. తన కుటుంబసభ్యులతో కలసి ఆమె ఆలయం వద్దకు వెళ్లేందుకు యత్నించగా... నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు కూడా లేకపోవడం గమనార్హం. వారిని చుట్టుముట్టిన నిరసనకారులు గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేశారు.

ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, కొంత మంది పోలీసులు తమతో పాటు రక్షణగా వచ్చారని... అయితే ఆలయం సమీపిస్తున్న సమయంలో వారు వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. నిరసనకారుల తీరుతో తమ పిల్లలు ఏడ్చేశారని చెప్పారు. ఇక చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశామని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, ఆలయం వరకు మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు.

sabarimala
woman
ap
Andhra Pradesh
entry
  • Loading...

More Telugu News