lady dotor suicide: భర్త విడాకుల నోటీసు పంపాడన్న మనస్తాపంతో భార్య ఆత్మహత్య

  • పుట్టింట్లో ఉరివేసుకుని బలవన్మరణం
  • బెంగళూరులో ఘటన...మృతురాలు డాక్టర్
  • ఏడాదిన్నరగా దంపతుల మధ్య విభేదాలు

విభేదాల నేపథ్యంలో పుట్టింటిలో ఉంటున్న ఓ వైద్యురాలు భర్త విడాకుల నోటీసు పంపడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...బెంగళూరుకు చెందిన రోహిత్‌, అశ్వని ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికీ ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. అశ్విని బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది.

పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో అశ్విని బెంగళూరులోని నందినీ లేఅవుట్‌లోని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ తన భార్య అశ్విని నుంచి విడాకులు కోరుతూ నోటీసులు పంపాడు. ఈ నోటీసులు అందగానే మనస్తాపానికి గురైన అశ్విని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు రాసిన లేఖలో ‘సారీ’ అని మాత్రమే పేర్కొంది. కాగా, అదనపు కట్నం కోసం రోహిత్‌ వేధిస్తున్నందువల్లే అశ్విని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

lady dotor suicide
bengalur
  • Loading...

More Telugu News