nani: 'జెర్సీ' కోసం ఈ రోజు రంగంలోకి దిగిన నాని
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-fec8dc4299c71dc0024634b4609dc8e4dd6d9970.jpg)
- నాని హీరోగా 'జెర్సీ'
- క్లాప్ కొట్టిన త్రివిక్రమ్
- రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నాడనీ, క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని సంస్థ కార్యాలయంలో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నానిపై దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా తొలి షాట్ ను చిత్రీకరించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-f1fa4b5f6ddb5d29e0ed6d30fed8eb542f5789d4.jpg)