Kurnool District: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

  • ఆలూరు మండలంలో తెల్లవారుజామున ప్రమాదం
  • జిల్లా అధికారులతో మాట్లాడిన చంద్రబాబు
  • గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశం

కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 

Kurnool District
aluru
Road Accident
Chandrababu
  • Loading...

More Telugu News