GVL Narasimha Rao: ఏపీకి కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ పాలనలోనే నిధులెక్కువ వచ్చాయి: జీవీఎల్

  • యూపీ కంటే ఏపీకే నిధులెక్కువ ఇచ్చాం
  • నిధులొస్తే తమ ప్రతిభే అంటారు
  • అనవసర ఆరోపణలు వద్దు

ఏపీకి కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ పాలనలోనే నిధులెక్కువ వచ్చాయని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్రం ఏపీకి నిధులిచ్చినప్పుడు చంద్రబాబు సహా నేతలంతా తమ ప్రతిభేనని చాటుకుంటారని.. రాని నిధుల గురించి మాత్రం గొడవ చేస్తారని జీవీఎల్ విమర్శించారు.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ కంటే ఏపీకే ఎక్కువ నిధులిచ్చినట్టు ఆయన తెలిపారు. అనవసరమైన ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టొదని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ప్రకారమే ఇస్తుందని ఆయన తెలిపారు.

GVL Narasimha Rao
Congress
Bjp
Chandrababu
UP
  • Loading...

More Telugu News