Jagityal Dist: జగిత్యాల జిల్లాలో మరో దారుణం.. ప్రేమ వ్యవహారంలో విద్యార్థి హత్య

  • డిగ్రీ చదువుతున్న నవీన్, శ్రవణ్
  • బంధువుల అమ్మాయి విషయమై గొడవ
  • దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన నవీన్

జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాదంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో జరిగిన గొడవ ఒక విద్యార్థి ప్రాణాలు బలిగొంది. ఆ వివరాలలోకి వెళితే, జగిత్యాల జిల్లా తాటిపల్లిలో సాధినేని నవీన్, శ్రవణ్‌‌... స్థానిక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. తమ బంధువుల అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నేడు శ్రవణ్‌పై నవీన్ గొడవకు దిగాడు.

ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో మాటా మాటా పెరిగి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా... శ్రవణ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసుల విచారణలో గతంలోనూ నవీన్, శ్రవణ్‌ల మధ్య గొడవలు జరిగినట్టు తేలింది. నవీన్‌ను చంపేందుకు వినియోగించిన కత్తిని శ్రవణ్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.

Jagityal Dist
Naveen
Sravan
Degree College
Murder
  • Loading...

More Telugu News