Hero Nikhil: స్వయంగా వెళ్లి ‘తిత్లీ’ బాధితులను పరామర్శించి.. సాయమందించిన హీరో నిఖిల్

  • 2500 కేజీల బియ్యం
  • పోర్టబుల్ జనరేటర్ల పంపిణీ
  • 500 దుప్పట్లు.. 3 వేల మందికి భోజనం

‘తిత్లీ’ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముందుగా రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆయన తర్వాత విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ప్రకటించారు. అక్కడి నుంచి సినీ ప్రముఖులంతా వరుసగా ఆర్థికసాయం చేయడమే కాకుండా సిక్కోలుకు అండగా నిలబడాలని పిలుపునిస్తున్నారు.

తాజాగా హీరో నిఖిల్ మరో ముందడుగు వేశాడు. స్వయంగా బాధిత ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజానీకాన్ని పరామర్శించడమే కాదు, 3 వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు. అలాగే 2500 కేజీల బియ్యం, 500 దుప్పట్లు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్న వారికోసం పోర్టబుల్ జనరేటర్లు పంపిణీ చేశాడు. అలాగే అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేశాడు. అది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Hero Nikhil
Srikakulam District
Titli cyclone
Vijay Devarakonda
  • Loading...

More Telugu News