polavaram: ‘పోలవరం’పై చంద్రబాబు ప్రతివారం క్యాట్ వాక్ చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీకి మోదీ ఇచ్చిన వరం ‘పోలవరం
  • నిధులిస్తున్నా చంద్రబాబు జాప్యం చేస్తున్నారు
  • రాజధాని భూములపై చంద్రబాబు, లోకేష్ వ్యాపారం

సీఎం చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు లో కమీషన్లు తింటున్న టీడీపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఏపీకి మోదీ ఇచ్చిన వరం ‘పోలవరం’ అని, ఆ ఏడు మండలాలను ఏపీలో కనుక కలపకపోతే ‘పోలవరం’ కలగా మిగిలిపోయేదేనని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిస్తున్నా చంద్రబాబు జాప్యం చేస్తున్నారని, ‘పోలవరం’పై చంద్రబాబు ప్రతివారం క్యాట్ వాక్ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని భూములపై చంద్రబాబు, లోకేష్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

polavaram
Chandrababu
kanna
cat-walk
  • Loading...

More Telugu News