kumaraswamy: సీఎం కుమారస్వామి భార్య అనిత ఆస్తుల వివరాలు ఇవే!

  • కుమారస్వామి రాజీనామాతో రామనగర నియోజకవర్గానికి ఉపఎన్నిక
  • బరిలోకి దిగిన కుమారస్వామి భార్య అనిత
  • అఫిడవిట్ లో రూ. 94 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడి

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయన రామనగర అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా కుమారస్వామి భార్య అనిత పోటీలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్ లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం ఆస్తులను రూ. 94 కోట్లుగా వెల్లడించారు. తన భర్త కుమారస్వామి పేరుతో మరో రూ. 7.88 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. 2008లో మధుగిరి నుంచి అనిత పోటీ చేసి గెలిచారు. 2012లో చెన్నపట్న నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ పై ఆమె పోటీ చేస్తున్నారు.  

kumaraswamy
wife anitha
ramanagara
by election
assets
  • Loading...

More Telugu News