srilekha: నేను చదువుకోలేదు .. నాకు అంత టైమ్ కూడా లేదు: శ్రీలేఖ
- చిన్నప్పటి నుంచే సంగీతం అంటేనే ఇష్టం
- ఎల్కేజీ మాత్రమే చదివాను
- మా పెదనాన్నతో మా నాన్న అలా అన్నారు
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో 80 సినిమాల వరకూ శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు. సినిమా పాటలు .. ప్రైవేట్ పాటలు కలుపుకుని నాలుగు వేల పాటలు వరకూ పాడారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక అంశాలను గురించి ముచ్చటించారు.
"నేను ఎల్కేజీ మాత్రమే చదివాను .. చదువుకోవడానికి టైమ్ ఉంటేగదా .. చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఇష్టంతో ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ గా నోట్స్ ఎలా ఇస్తారు అని చాలామంది అనుకుంటారు .. దానికి చదువు అవసరం లేదు. ఒకసారి మా పెదనాన్నగారు .. మా నాన్నగారితో "దానిని చదువు .. సంధ్య లేకుండా అలా ఉంచావు .. సంగీతం వరకూ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నావ్ .. రేపు పొద్దున్న అది ఎలా బతుకుతుంది? కనీసం పదో క్లాస్ వరకైనా ఉండాలి గదా?" అని అన్నారు. అప్పుడు మా నాన్నగారు "అన్నయ్య, చదివితే మంచి ఉద్యోగం వస్తుందేమో .. కానీ ఇది సంగీతం వైపు రావడం వలన తెలుగులో ఫస్టు లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబడింది" అన్నారు అంటూ నవ్వేశారు.