Somireddy: ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చేస్తాననడం పవన్ అజ్ఞానం!: సోమిరెడ్డి

  • నారా లోకేష్ పై నిన్న పవన్ విమర్శలు
  • పవన్ వాడిన భాషను మరెవరూ వాడలేరు
  • ఆయన రాజకీయ పరిజ్ఞానం చాలా స్వల్పమన్న సోమిరెడ్డి

కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా డైరెక్టుగా పంచాయతీ రాజ్ శాఖకు నారా లోకేష్ మంత్రి ఎలా అయ్యారంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నిప్పులు చెరగడంపై ఏపీ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. పవన్ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అభిప్రాయపడ్డ ఆయన, పవన్ మాటలు జిల్లా కలెక్టరుగా పనిచేయాలంటే, ముందు బిల్ కలెక్టర్ గా పనిచేయాలన్నట్టుందని ఎద్దేవా చేశారు. తనను ప్రజలు సినిమా హీరోగా చూస్తున్నారా? పొలిటికల్ లీడర్ గా చూస్తున్నారా? అన్ని విషయాన్ని ఆయనే ఆలోచించుకోవాలని అన్నారు.

ఎస్టీలకు రిజర్వ్ అయిన పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎంత స్వల్పమో తెలుస్తోందని అన్నారు. పవన్ వాడిన భాషను ఏ పార్టీ ఉపయోగించదని, వారసత్వ రాజకీయాలు వద్దంటున్న పవన్, తన అన్న వారసత్వం నుంచే రాజకీయాల్లోకి రాలేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోదీతో కలసి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ నడుస్తారని ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారని, అంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని వ్యాఖ్యానించారు.

Somireddy
Pawan Kalyan
Nara Lokesh
Jagan
Narendra Modi
  • Loading...

More Telugu News