Sri Reddy: నా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... లారెన్స్ సినిమాలో చాన్స్ వచ్చింది... అడ్వాన్స్ డబ్బులు సిక్కోలు ప్రజలకు: శ్రీరెడ్డి

  • క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డి
  • లారెన్స్ ను ఆయన ఇంట్లో కలుసుకున్న శ్రీరెడ్డి
  • తరువాతి చిత్రంలో పాత్రను ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చారని చెప్పిన నటి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డికి లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో చాన్స్ లభించింది. ఈ విషయాన్ని శ్రీరెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.

 "నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్ ను ఆయన నివాసంలో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్ తో సంతోషంగా ఉన్నారు. నాకోసం ప్రార్థించారు కూడా. నేను ఆడిషన్స్ లో పాల్గొన్నాను. తన తదుపరి చిత్రంలో తీసుకుంటున్నానని హామీ ఇచ్చిన లారెన్స్, మంచి పాత్రను ఆఫర్ చేస్తానన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును నేను తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను" అని పేర్కొంది. 

Sri Reddy
Lawrence
New Movie
Srikakulam District
Titly
Chance
  • Loading...

More Telugu News