giribabu: నటుడు గిరిబాబుకి పితృ వియోగం!

  • గిరిబాబు తండ్రి ఎర్ర నాగయ్య కన్నుమూత
  • ఆయన వయసు 108 సంవత్సరాలు
  • సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు

టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం నెలకొంది. గిరిబాబు తండ్రి ఎర్ర నాగయ్య నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లాలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 108 సంవత్సరాలు గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

సినీపరిశ్రమలో గిరిబాబు నిలదొక్కుకోవడం వెనుక ఆయన తండ్రి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. తండ్రి సహకారంతోనే గిరిబాబు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఎర్ర నాగయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఇక గిరిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు రఘుబాబు కమెడియన్ గా రాణిస్తున్నారు. 

giribabu
actor
father
dead
tollywood
  • Loading...

More Telugu News