chaitu: మనసును తట్టిలేపుతోన్న 'సవ్యసాచి' లిరికల్ సాంగ్

  • హృదయాన్ని తాకే సాహిత్యం 
  • ఆకట్టుకునే సంగీతం 
  • నవంబర్ 2న విడుదల

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' చిత్రం రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "ఒక్కరంటే ఒక్కరు .. ఇద్దరంటే ఇద్దరు .. ఒక తనువును ఎదిగిన కవలలు .. ఒక తీరున కదలని తలపులు .. ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు .. అమ్మకదే పదివేలు" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఒకే తనువుగా కలిగిన తన కవల పిల్లల గురించి ఒక తల్లి పాడే పాటగా ఇది కొనసాగుతోంది. "నా కలలకు రెక్కలు మీరు .. నా ఎనిమిది దిక్కులు మీరు" అంటూ తన పిల్లల గురించి ఓ తల్లి ఆవిష్కరించిన భావజాలం అద్భుతమనే చెప్పాలి. ఈ అక్షరాలు తల్లి హృదయాన్ని తట్టిలేపేలా వున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది .. ఇక కీరవాణి బాణీల్లోని బలం ఎంతమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించేలా ఈ పాట వుంది. భూమిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News