Renu Desai: ఈ ట్రయిలర్ చూడండి: రేణూ దేశాయ్

  • రైతు సమస్యలు ఇతివృత్తంగా చిత్రం
  • రైతుల మేలు కోరుతూ దీన్ని నిర్మించారు
  • లింక్ ను పంచుకున్న రేణూ దేశాయ్

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన 'మిట్టీ' చిత్రం ట్రయిలర్ ను చూడాలని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కోరింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఉదయం ఓ పోస్టును పెట్టిన ఆమె, "మనకు జీవనాధారం రైతులే. దేశంలో రైతుల మేలుకోరే కొందరు నిర్మించిన చిత్రం ట్రయిలర్ లింక్ ను నేను పంచుకుంటున్నాను. దీన్ని చూడండి" అని వ్యాఖ్యానించింది.

దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలు పండక, తీసుకున్న అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడే రైతన్నల కుటుంబాలు, ఒక సీజన్ లో మంచి ధర వచ్చిందని, అప్పు చేసి డబ్బు తెచ్చి, పత్తి పంటను వేసి, వర్షాలు కురవక పంట నష్టపోతున్న రైతన్నల వ్యధలను ఈ ట్రయిలర్ లో ప్రస్తావించారు.

Renu Desai
Farmers
India
Mitti
Trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News