Saif Ali Khan: నా కూతురిని పిలిస్తే ఒకటే గుద్దు: సైఫ్ అలీ ఖాన్

  • అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం దారుణం
  • పని కోసం వస్తే ఆ తరహా చర్యలు కూడదు
  • 'మీటూ'పై స్పందించిన బాలీవుడ్ నటుడు

తన కుమార్తెతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఏకాంతంగా కలవాలని కోరినా, విషయం తనకు తెలిస్తే, ఒక్క గుద్దు గుద్దుతానంటున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. తాజాగా 'మీటూ'పై స్పందించిన ఆయన, తమకు పని కావాలంటూ వచ్చే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం అత్యంత దారుణమైన విషయమని అభిప్రాయపడ్డాడు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన ఆయన, బాధితులకు ఎవరూ రక్షణగా లేరన్న ఆలోచనతో అసభ్యంగా ప్రవర్తించరాదని అన్నాడు.

 "నా కూతురు సారా అలీ ఖాన్ ను ఎవరైనా అక్కడికి రా, ఇక్కడికి వచ్చి కలువు అని అడిగితే, వాళ్ల మొహం మీద ఒక్క పంచ్ ఇస్తా. నన్ను ఏదైనా అన్నా కూడా వాళ్లు నన్ను కోర్టులో కలవాలి. నా రియాక్షన్ అదే. ప్రతి యువతికీ రక్షణ లభించాలని కోరుకుంటున్నా" అని అన్నాడు.

Saif Ali Khan
Sara Ali Khan
MeToo
Work Place
MeToo India
  • Loading...

More Telugu News