Pawan Kalyan: జగన్‌పై నాకు కోపం లేదు.. వైఎస్‌పై మాత్రం అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది: పవన్

  • సినిమా విషయంలో వైఎస్ నన్ను బలవంతం చేశారు
  • కోట్లాది మంది అభిమానులున్న నన్నే బెదిరించారు
  • రాష్ట్ర ప్రభుత్వం దాడి జరిగితే అండగా ఉంటా

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీపై సోమవారం నిర్వహించిన కవాతు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..  సొంత అన్నయ్యను వదిలి వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ కార్యాలయాల మీద చేస్తున్నట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం నిజంగా దాడి జరిగితే అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

వైసీపీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఏమాత్రం కోపం లేదని స్పష్టం చేశారు. ఆయన లక్ష కోట్ల రూపాయలు తిన్నారో, లేదో ఆ భగవంతుడికే తెలియాలన్న పవన్.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై మాత్రం ఓసారి పట్టరాని కోపం వచ్చిందన్నారు. 2007లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సినిమా తీయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కోట్లాదిమంది అభిమానులున్న తనలాంటి వాడినే బెదిరిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందోనని తలచుకుంటే కోపం వచ్చినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News