Pawan Kalyan: ఐటీ దాడులను టీడీపీ ప్రభుత్వంపై దాడులుగా ఎలా చెబుతారు?: పవన్ కల్యాణ్

  • ఆ దాడులు టీడీపీ ప్రభుత్వంపైన జరిగినట్టా?
  • ఒకవేళ బాబుపై, ప్రభుత్వ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగితే ఊరుకోం
  • రాష్ట్ర ప్రజల కోసం వారికి అండగా ఉంటాం

ఏపీలో జరిగిన ఐటీ దాడుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ధవళేశ్వరంలో ఈరోజు నిర్వహించిన ‘జనసేన’ బహిరంగ సభ వేదికగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై, ఆయన కార్యాలయంపై ఐటీ దాడులు జరిగినట్టుగా సీఎం చంద్రబాబుపై, ప్రభుత్వ కార్యాలయాలపైనా కేంద్ర ప్రభుత్వం ఈ తరహా దాడులు కనుక చేస్తే.. టీడీపీ ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రజల కోసం వారికి అండగా ఉంటామని చెప్పారు.

ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ, గుంటూరు బ్రిక్స్ ఫ్యాక్టరీలో లేదా టీడీపీ ఎంపీ నివాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తే.. వాటిని టీడీపీ ప్రభుత్వంపై దాడులుగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టే పనులు కనుక చేస్తే ఊరుకోమని, తాము అండగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
dhawaleswaram
jana sena
  • Loading...

More Telugu News