Tollywood]: త్రివిక్రమ్ ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టాడు.. సీన్లను తొలగించకుంటే థియేటర్లలో ‘అరవింద సమేత’ను అడ్డుకుంటాం!: సీమ సంఘాల వార్నింగ్

  • సీమపై టాలీవుడ్ కక్ష కట్టింది
  • అభ్యంతరకరమైన సీన్లను తొలగించాలి
  • సీమ ప్రజలకు త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాలి

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. తెలుగు సినీ పరిశ్రమ రాయలసీమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో సీమపై పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని విమర్శించారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ పోరాట సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు.

త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించి పలు అభ్యంతరకరమైన సీన్లు, మాటలు ఉన్నాయని నేతలు ఆరోపించారు. ఇలాంటి సినిమాను తీసినందుకు త్రివిక్రమ్ సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.

Tollywood]
trivikram
aravinda sameta
rayalaseema
angry
leaDERS
say sorry
ntr
  • Loading...

More Telugu News