tulasi reddy: ఓవైపు శ్రీకాకుళం మునిగిపోతే.. పవన్ పూల వర్షం కురిపించుకుంటున్నారు: తులసిరెడ్డి విమర్శ

  • పవన్ పార్టీ జనసేన కాదు.. ధనసేన
  • పేదల పార్టీకి ఇన్ని డబ్బులు ఎక్కడివి?
  • ఏపీ ప్రజలు బీజేపీని శని గ్రహంగా చూస్తున్నారు

ఏపీ ప్రజలు బీజేపీని శని గ్రహంగా, టీడీపీని రాహువుగా, వైసీపీని కేతువుగా చూస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పేరు జనసేన కాదని, ధనసేన అని విమర్శించారు. సినిమా ఫక్కీలో హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... పేదల పార్టీ అని చెప్పుకునే జనసేనకు ఇన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. తుపాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా మునిగిపోతే... పూల వర్షం కురిపించుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. 

tulasi reddy
pawan kalyan
janasena
congress
bjp
Telugudesam
  • Loading...

More Telugu News