chinmayi: చిన్మయి ఆరోపణల్లో నిజం ఉంది: నటి శ్రీప్రియ

  • చిన్మయి బాధ్యత గల అమ్మాయి
  • సినీ రంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయి
  • వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తమిళ సినీ రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ గాయని చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్మయికి ప్రముఖ నటి శ్రీప్రియ అండగా నిలిచింది. చిన్మయి చాలా బాధ్యత గల అమ్మాయని... ఆమె చేసిన ఆరోపణల్లో నిజం ఉండొచ్చని చెప్పింది.

సినీ రంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయని... వేధింపులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లైంగిక ఆరోపణలపై విచారణ కమిటీ వేస్తున్నట్టు నడిగర్ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ ప్రకటించడం సంతోషకరమని ఆమె తెలిపారు.

మరో నటి కస్తూరి దీనిపై స్పందిస్తూ, అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయని తెలిపింది. ఈ విషయంలో మహిళలకు న్యాయం జరగాలని కోరింది. మీటూ ఉద్యమంతో మహిళలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకుందని తెలిపింది.

chinmayi
sexual harrassment
kollywood
tollywood
sripriya
kasturi
  • Loading...

More Telugu News