saif ali khan: సినీ పరిశ్రమలో నేను కూడా వేధింపులను ఎదుర్కొన్నా: సైఫ్ అలీ ఖాన్

  • నేను ఎదుర్కొన్నవి లైంగిక వేధింపులు కావు
  • ఆ వేధింపులను ఇప్పుడు బయట పెట్టలేను
  • లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వారితో కలసి పని చేయను

బాలీవుడ్ లో ఉన్న పలువురు మహిళలు తాము లైంగిక వేధింపులకు గురైనట్టు వివరాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, 25 ఏళ్ల క్రితం తాను వేధింపులకు గురయినట్టు తెలిపాడు. అయితే, అవి లైంగిక వేధింపులు కావని, అయినప్పటికీ ఆ వేధింపులను తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు మండిపోతుందని చెప్పాడు. తాను ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టలేనని... ఎందుకంటే ఇప్పుడు తాను సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తినని తెలిపాడు.

ఇక నుంచి అయినా మహిళల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సైఫ్ చెప్పాడు. సినీ పరిశ్రమలో ఏది జరిగినా మన మంచికేనని... మీటూ ఉద్యమం ద్వారా తప్పులు చేసిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తాను చూస్తూ ఊరుకోనని చెప్పాడు. మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లయితే బయటకు వచ్చాయో... ఇకపై వారితో కలసి పని చేయబోనని తెలిపాడు.

saif ali khan
bollywood
harrassment
meetoo
  • Loading...

More Telugu News