Medchal Malkajgiri District: మేడ్చల్‌ జిల్లాలో ఘోరం...యువకుడిని చంపి దహనం చేసిన దుండగులు

  • గోనె సంచిలో మూటకట్టి అమానుషం
  • స్థానికులు అరవడంతో పరారు
  • మృతుని వివరాలు తెలియరాలేదని పోలీసుల వెల్లడి

అమానుషం...ఘోరం...ఓ గుర్తు తెలియని యువకుడిని చంపి గోనె సంచిలో మూటకట్టి దహనం చేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మేడ్చల్‌ జిల్లా జవహర్‌ నగర్‌ పరిధి చెన్నాపురంలో కొందరు దుండగులు ఓ యువకుడిని చంపేశారు. అనంతరం గోనె సంచిలో పెట్టి దహనం చేస్తుండగా చూసిన గ్రామస్థులు గట్టిగా కేకలు వేస్తూ రావడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు. వివరాలు తెలియక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు.

Medchal Malkajgiri District
murder
jawaharnagar
  • Loading...

More Telugu News