geeta madhuri: యూట్యూబ్ ఛానళ్లపై గీతామాధురి ఆగ్రహం.. లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్!

  • తన గురించి తప్పుగా చూపడంపై మండిపాటు
  • వీలైనంత త్వరగా తొలగించాలని డిమాండ్
  • చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని స్పష్టీకరణ

తెలుగు బిగ్ బాస్-2 షో లో రన్నరప్ గా నిలిచిన గాయని గీతా మాధురి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కథనాలను సదరు ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయని మండిపడింది ఇప్పటికైనా ప్రవర్తనను మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. తనను ఇబ్బంది పెట్టేలా కొందరు వ్యక్తులు తప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాంటి వ్యక్తులకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాననీ, ఆ వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ తీసిన వీడియోలను తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ పోస్ట్ చేసింది.

geeta madhuri
Tollywood
singer
youtube
videos
wrong content
bigboss-2 telugu
legal action
fake news
  • Loading...

More Telugu News