sri reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను లైంగికంగా వేధించారు: శ్రీరెడ్డి ఆరోపణ

  • ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నన్ను లైంగికంగా వేధించారు
  • నా వద్ద ఎందరి పేర్లో ఉన్నాయి
  • సమయం వచ్చినప్పుడు అన్ని పేర్లు బయటపెడతా

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ భూతంపై పెద్ద పోరాటమే చేస్తున్న నటి శ్రీరెడ్డి... తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఆర్మూరు నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని తీవ్ర ఆరోపణలు చేసింది. జాతీయ మీడియా 'న్యూస్ ఎక్స్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్వ్యూ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పేరును కూడా ఆమె ప్రస్తావించింది. తన వద్ద ఎందరి పేర్లో ఉన్నాయని... వారి పేర్లను బయటపెట్టడానికి ఇది సరైన సమయం కాదని తాను భావిస్తున్నానని తెలిపింది. సమయం వచ్చినప్పుడు అందరి పేర్లను బయటపెడతానని చెప్పింది. ఎన్నికల్లో సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరింది.

sri reddy
jeevan reddy
TRS
sexual harrassment
tollywood
meetoo
  • Error fetching data: Network response was not ok

More Telugu News