Vijayawada: దీపకాంతుల మధ్య విజయవాడ నగర అందమిది... వైరల్ అవుతున్న ఫొటో!

  • దసరా సందర్భంగా ముస్తాబైన బెజవాడ
  • ఆకాశం నుంచి తీసిన అద్భుత చిత్రం
  • ధగధగలాడిపోతున్న ఇంద్రకీలాద్రి

శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబుకాగా, డ్రోన్ కెమెరాతో తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపకాంతుల ధగధగల మధ్య ఇంద్రకీలాద్రి, కాళేశ్వరరావు మార్కెట్, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది, సీతానగరం ఏరియాలను ఈ చిత్రంలో బంధించారు.

 ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా నవరాత్రుల్లో భాగంగా ఆలయ పరిసరాలు ధగధగలాడుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇది బెజవాడ అందమని, తమది అందమైన నగరమని అంటున్నారు. కాగా, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఈ ఫొటోను తీయించింది. ఆ ఫొటోను మీరూ చూడవచ్చు.

Vijayawada
Areal View
Drone
Viral
  • Loading...

More Telugu News