Navjot singh sidhu: అంతమాటంటావా?.. వెళ్లి ఇమ్రాన్ ఖాన్ కేబినెట్‌లో చేరు!: సిద్ధూపై బీజేపీ మండిపాటు

  • దక్షిణాదికి వెళ్లడం కంటే పాక్ వెళ్లడమే బెటరన్న సిద్ధూ 
  • సర్వత్ర విమర్శలు
  • 'కమెడియన్' అన్న అన్నాడీఎంకే

దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లడం కంటే పాకిస్థాన్‌ వెళ్లడమే మేలంటూ కాంగ్రెస్ నేత సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. పాకిస్థాన్ అంటే అంత ప్రేమ ఉంటే వెంటనే వెళ్లి ఇమ్రాన్ కేబినెట్‌లో మంత్రిగా చేరాలని సూచించింది. సిద్ధూ తన వ్యాఖ్యలతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ మాటల్లో కుట్ర దాగి ఉందన్నారు. నిజంగా పాకిస్థాన్ అంటే అంత ప్రేమే కనుక ఉంటే వెంటనే వెళ్లి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ కేబినెట్‌లో చేరాలని సూచించారు.

సిద్ధూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సిద్ధూపై వేటు వేయాలన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి మురళీధరన్ శివలింగం సిద్ధూ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆయనో కమెడియన్ అని ఎద్దేవా చేశారు.

Navjot singh sidhu
South India
Pakistan
Imran khan
BJP
AIADMK
  • Loading...

More Telugu News