West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో టోర్నడో... పరుగులు పెట్టిన ప్రజలు!
- అమెరికాలో ఎక్కువగా కనిపించే టోర్నడోలు
- గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో భీకర సుడిగాలి
- ఆందోళనలో మత్స్యకారులు
ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో ఎక్కువగా కనిపించే టోర్నడో పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపించి, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన సుడిగాలి, భీకరంగా తిరుగుతూ, నదిలోని నీటిని సుడులు తిప్పింది. దీన్ని చూసిన మత్స్యకారులు, ప్రజలు పరుగులు పెట్టారు. కాగా, గత సంవత్సరం వర్షాకాల సీజన్ లో సైతం ఈ టోర్నడోలు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో కనిపించాయి. వీటి ఫలితంగా సముద్రంలోని చేపలు గాల్లోకి వెళ్లి జనావాసాలపై చేపల వర్షం కూడా కురిసిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి ఈ ప్రాంతంలో టోర్నడో కనిపించడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ.