weather: దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం!
- ఒడిశా నుంచి కోస్తా వరకు తమిళనాడు మీదుగా ద్రోణి
- రానున్న 24 గంటల్లో కోస్తా, రాయసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం
- సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
దక్షిణ అండమాన్ సముద్రంలో వారం రోజుల్లోగా మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఈ నెల 22, 23 తేదీల్లో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఒడిశా నుంచి కోస్తా వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.