alahabad: అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్’ గా మార్చనున్నాం: యూపీ సీఎం యోగి

  • యూపీ ప్రజల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం
  • గవర్నర్ ఆమోదం కూడా లభించింది
  • కేబినెట్ ఆమోదం లభించగానే ‘ప్రయోగ్ రాజ్’ అమల్లోకి

యూపీలోని అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్‘గా మార్చనున్నట్టు సీఎం యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. యూపీ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. 2019 కుంభమేళా కంటే ముందుగానే అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్’ గా మార్చాలని ఇటీవల జరిగిన సమావేశంలో అఖాడ పరిషత్ ప్రతిపాదించిందని, దీనికి, గవర్నర్ ఆమోదం కూడా లభించిందని, కేబినెట్ ఆమోదం అనంతరం, ‘ప్రయోగ్ రాజ్’ పేరు వాడుకలోకి వస్తుందని స్పష్టం చేశారు. కుంభమేళా గురించి ఆదిత్యానాథ్ ప్రస్తావిస్తూ.. కుంభమేళా జరిగే ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. 

alahabad
prayagraj
cm yogi
Uttar Pradesh
  • Loading...

More Telugu News