Harish Rao: కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ పాలిట గుదిబండ!: హరీశ్‌రావు

  • తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
  • జాతీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయి
  • మధ్యప్రదేశ్ లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీది

కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ పాలిట గుదిబండ అని... మహా కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ .. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణకు ఏమిస్తారో స్పష్టం చేసి రావాలని డిమాండ్ చేశారు.

కేంద్ర పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌దని.. ఆయన మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని హరీశ్‌రావు తెలిపారు. టీడీపీ పక్కా ఆంధ్ర పార్టీ అని... టీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని స్పష్టం చేశారు. నాలుగు ఎంపీ సీట్ల కోసం జాతీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలు అవకాశవాద పార్టీలని... ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంలో బీజేపీది కీలక పాత్రగా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీదని హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao
KCR
Rahul Gandhi
Telangana
Special Status
  • Loading...

More Telugu News