Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ ఎన్నికల పర్యటన ఖరారు

  • మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్న రాహుల్
  • రోశయ్యకు ‘రాజీవ్‌ గాంధీ సద్భావన స్మారక’ అవార్డు
  • 11 గంటలకు రాజీవ్ ‘సద్భావన యాత్ర’

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి సారించారు. రాష్ట్రంలో జరగనున్న మూడు బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొననున్నారు. 20వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు శంషాబాద్‌ చేరుకొని 11 గంటలకు చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ ‘సద్భావన యాత్ర’ సభలో పాల్గొంటారు.

అదే యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ‘రాజీవ్‌ గాంధీ సద్భావన స్మారక అవార్డు’ను అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో ఎన్నికల సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.45 నిమిషాలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై అనంతరం రాత్రి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Rahul Gandhi
Congress
Rosaiah
Adilabad District
Delhi
  • Loading...

More Telugu News