kanna laxmi narayana: కన్నా లక్ష్మీనారాయణ ఓ గురివింద గింజ: టీడీపీ నేత వర్ల రామయ్య

  • కన్నా తన ఆస్తులు ప్రకటించాలి
  • అమిత్ షా కుమారుడి ఆస్తులు16 వేల రెట్లు పెరిగాయి
  •  ఐటీ దాడులు ఎందుకు చేయరు?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. కన్నా ఓ గురివింద గింజ అని, కన్నా తన ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి ఆస్తులు 16 వేల రెట్లు పెరిగితే, ఐటీ దాడులు ఎందుకు చేయరు? వైసీపీ, బీజేపీ నేతలపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు.

రాఫెల్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని. ఐటీ దాడులపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీకి ఆయన అనుసంధాన కర్త అని ఆరోపించారు. జగన్ పై కన్నా ఏ ఒక్క విమర్శ ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్ కు ట్యూటర్ గా చేరారని అన్నారు. 

kanna laxmi narayana
varla ramaiah
Telugudesam
bjp
  • Loading...

More Telugu News