trivikram srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపించిన జూనియర్ ఎన్టీఆర్

  • ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్
  • త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన  అద్భుత చిత్రమిది
  • ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం విజయోత్సవ సభలో దర్శకుడు త్రివిక్రమ్ పై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘అరవింద సమేత’ విజయోత్సవ వేడుక ఈరోజు నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ సహా చిత్రయూనిట్ హాజరైంది.

 ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేయాలని, ఆ చిత్రం జీవితాంతం తన గుండె లోతుల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని, ఆ చిత్రాన్ని సమాజానికి, తన పిల్లలకూ చూపించుకోవాలని అనుకున్నానని, అటువంటి చిత్రం ‘అరవింద సమేత’ అని కొనియాడారు.

ఈ సినిమా విజయాన్ని త్రివిక్రమ్ తన ఖాతాలో వేస్తున్నారని, ‘అది తప్పని, ఎందుకంటే, త్రివిక్రమ్ ను తాను నమ్మానని, ఆయన్ని అంతలా నమ్మేలా చేసింది ఆయనే కదా’ అని అన్నారు. త్రివిక్రమ్ కలం నుంచి పుట్టిన ఓ అద్భుతమైన కథ ‘అరవింద సమేత’ అని ప్రశంసలతో ముంచెత్తారు.

trivikram srinivas
junior ntr
aravinda sametha
  • Loading...

More Telugu News