MJ Akbar: 'మళ్లీ మాట్లాడతా' లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకుండా వెళ్లిపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్

  • విదేశాల నుంచి వచ్చిన ఎంజే అక్బర్
  • విషయం తెలుసుకుని చుట్టుముట్టిన మీడియా
  • మాట్లాడకుండా వెళ్లిపోయిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్, ఈ ఉదయం విదేశీ పర్యటనను ముగించుకుని ఇండియాకు వచ్చిన వేళ, ఆరోపణలపై స్పందించకుండానే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించారని ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన ఎడిటర్ గా పనిచేస్తున్న వేళ ఈ ఘటన జరిగిందని ఇద్దరూ ఆరోపించడం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

దీంతో అక్బర్ రాజీనామాకు ప్రతిపక్షాలు సహా, బీజేపీలోని కొందరు సీనియర్లు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, ఈ ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో లాండయ్యారు. ఎంజే అక్బర్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. కాగా, నేడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్టు తెలుస్తుండగా, లైంగిక ఆరోపణల నేపథ్యం, పోలీసుల విచారణ మొదలు కావడంతో మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని మోదీ కోరవచ్చని సమాచారం.

MJ Akbar
Sexual Harrasment
Editor
Central Minister
Prime Minister
Narendra Modi
  • Error fetching data: Network response was not ok

More Telugu News