Srikakulam District: కారు టైర్లు పేలి, డివైడర్ పైకి... ఏపీ మంత్రి సోమిరెడ్డికి తప్పిన ఘోర ప్రమాదం!

  • శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మంత్రి సోమిరెడ్డి
  • జాతీయ రహదారిపై అదుపు తప్పిన వాహనం
  • డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఉదయం ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం జాతీయ రహదారిపై అదుపుతప్పింది.

దాంతో వాహనం టైర్లు పేలడంతో, వాహనం స్కిడ్ అయి, డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తరువాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు.

Srikakulam District
Titly
Somireddy
Accident
  • Loading...

More Telugu News