CM Ramesh: రెండు రోజుల సోదాలు... సీఎం రమేష్ ఇంట దొరికింది రూ. 3.53 లక్షలు మాత్రమే!

  • శనివారం అర్ధరాత్రి వరకూ సాగిన తనిఖీలు
  • 14 బ్యాంకు ఖాతాల గుర్తింపు
  • తనిఖీలు ముగిశాయన్న ఐటీ అధికారులు

శుక్రవారం ఉదయం నుంచి శనివారం అర్ధరాత్రి వరకూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు రూ. 3.53 లక్షల నగదును గుర్తించారు. ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న 14 బ్యాంకు ఖాతాలను గుర్తించారు.

ఆయన కంపెనీల్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను అధికారులు వెంటతీసుకెళ్లారు. సీఎం రమేష్ ఇంట్లోని ఓ లాకర్, ఆయన వేలిముద్రలతోనే తెరచుకుంటుందని తెలుసుకున్న అధికారులు, ఢిల్లీలో ఉన్న ఆయన్ను పిలిపించి, దానిని తెరిపించారు. ఆపై తమ తనిఖీలు ముగిశాయని గత అర్ధరాత్రి వెల్లడించిన అధికారులు, పంచనామా పత్రాల కాపీని సీఎం రమేష్ కు అందించి వెళ్లిపోయారు.

CM Ramesh
IT Raids
Locker
Cash
Telugudesam
  • Loading...

More Telugu News