Jagityal: ప్రేమించిందని... యువతికి వింత శిక్ష వేసిన ఊరి పెద్దలు!

  • ఏ తప్పూ చేయలేదన్నా వినలేదు
  • కుటుంబ సభ్యలకూ వేధింపులు
  • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం భీంరెడ్డిగూడెంలో వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిని ఘోరంగా అవమానించేందుకు ప్రయత్నించారు ఊరి పెద్దలు. వాళ్లు అనుమానించినట్లు ఆ అబ్బాయిని తాను ప్రేమించలేదని, ఏ తప్పూ చేయలేదని యువతి మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదు. కుటుంబసభ్యులకు కూడా ఊరి పెద్దల నుంచి వేధింపులు తప్పలేదు.

చివరకు తల్లిదండ్రుల పరిస్థితి చూసి ఊరి పెద్దలు చెప్పింది వినాలని బాధితురాలు నిర్ణయించుకుంది. రక్తంతో స్నానం చేయించి గుండుగీసి ఊరేగించాలన్న తీర్మానానికి కట్టుబడేందుకు సిద్ధమైంది. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో, వారు వచ్చి ఈ తతంగాన్ని అడ్డుకున్నారు. యువతిని కరీంనగర్‌లోని మదర్స్‌హోమ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కులపెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jagityal
Bheemreddy gudem
Other caste
Police
Karimnagar
  • Loading...

More Telugu News