gaddar: గద్దరన్న మాతో ఒకమాట చెప్పుంటే బాగుండేది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

  • మా కూటమికి గద్దర్ మద్దతివ్వడం మంచి పరిణామమే
  • రాహుల్, సోనియాలతో భేటీకి ముందు భాగస్వామ్య పార్టీలకు చెప్పాల్సింది
  • అలా చేసి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేది

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీలను ప్రజా గాయకుడు గద్దర్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పందిస్తూ, ‘మహాకూటమి’కి మద్దతిస్తున్నానని గద్దరన్న చెప్పడం మంచి పరిణామమేనని, అయితే, రాహుల్, సోనియాలను కలుస్తున్నట్టుగా ఒక మాట ‘మహాకూటమి’లోని భాగస్వామ్య పార్టీలతో ఆయన చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గద్దరన్న అలా చేసి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదని, ఏదేమైనప్పటికీ ఓటు విలువ గుర్తించి దాని ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని గుర్తెరగడం సంతోషదాయకమని అన్నారు.

gaddar
chada venkat reddy
  • Loading...

More Telugu News