singer karthis: కార్తీక్ లైంగిక వేధింపులకు నేనూ బాధితురాలినే: సింగర్ చిన్మయి శ్రీపాద

  • కార్తీక్ పై ఆరోపణలు చేసిన మహిళకు చిన్మయి మద్దతు
  • అతను చాలా మంది మహిళల వెంట పడేవాడు 
  • అసభ్యకర ఫొటోలు, సందేశాలు..పోస్ట్ చేస్తాడు 

గాయకుడు కార్తీక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ మెస్సేజ్ ను జర్నలిస్టు సంధ్యా మేనన్ కు ఆ మహిళ పంపడంతో, దాన్ని సంధ్య తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై ప్రముఖ గాయకురాలు చిన్మయి శ్రీపాద స్పందించారు.

బాధిత మహిళకు తన మద్దతు తెలుపుతున్నట్టు ఆమె పేర్కొంది. కార్తీక్ లైంగిక వేధింపులకు తాను కూడా బాధితురాలినేనని ఆరోపించారు. కార్తీక్ చాలా మంది మహిళల వెంట పడేవాడని, మహిళలకు అసభ్యకర ఫొటోలు, సందేశాలు, వీడియోలను అతను పోస్ట్ చేస్తుంటాడని ఆరోపించారు.

singer karthis
chinmai sripada
journalist sandhya
  • Loading...

More Telugu News