singer karthik: గాయకుడు కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణ

  • గాయకుడు కార్తీక్ పై ఓ మహిళ ఆరోపణ
  • ఈ విషయాన్ని జర్నలిస్టు సంధ్యా మేనన్ కు చెప్పిన బాధితురాలు
  • ఆ మెసేజ్ ను పోస్ట్ చేసిన సంధ్యా మేనన్

‘మీ టూ’ ద్వారా తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్న సెలబ్రిటిల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా, పేరు బయటపెట్టని ఓ మహిళ తానూ లైంగిక వేధింపుల బారిన పడ్డానంటూ జర్నలిస్టు సంధ్యా మేనన్ కు మెసేజ్ చేశారు. గాయకుడు కార్తీక్ వేధింపులకు తానూ బాధిరాలినేనంటూ పేర్కొన్న ఆ మెసేజ్ ను సంధ్యా మేనన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

‘హాయ్ సంధ్య, నేను సింగర్ కార్తీక్ గురించి మాట్లాడాలి. ఈ విషయంలో నేను గుర్తుతెలియని మహిళగా ఉండటమే మంచిది. కొన్నేళ్ల క్రితం నేను, కార్తీక్ ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యాం. అక్కడ కార్తీక్ నా శరీరం గురించి తప్పుగా మాట్లాడారు. నన్ను ముట్టుకోవాలని ఉందంటూ అసభ్య వ్యాఖ్యలు చేశారు.

ఆరోజు నేను ఏమాత్రం సౌకర్యంగా ఉండలేకపోయాను. కార్తీక్ పై అసహ్యం పుట్టింది. ఆయన్ని కలవాల్సి వచ్చిన  ప్రతిసారీ నేను భయపడిపోయేదాన్ని.. ఆయన ప్రముఖ గాయకుడు. పరిశ్రమలో పేరున్న వ్యక్తి. కనుక, నేను ఎవరో తెలియకపోవడమే మంచిదని భావిస్తున్నా. టూర్స్ కు వెళ్లినప్పుడు మహిళా సింగర్స్ ను వేధించేందుకు ప్రయత్నించే ఈ వ్యక్తికి సిగ్గులేదు’ అని సంధ్యకు పంపిన మెసేజ్ లో బాధిత మహిళ పేర్కొంది. 

singer karthik
journalist
sandhya menon
  • Loading...

More Telugu News