Nayani Narasimha Reddy: రేవంత్ రెడ్డి చిల్లరగాడు.. అలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే కాంగ్రెస్‌కే నష్టం: నాయిని

  • పొరపాటున రూ.10 కోట్లు అన్నా
  • కొడంగల్‌లో రేవంత్ ఓటమి ఖాయం
  • అప్పటి విషయాన్ని ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారు

రేవంత్ రెడ్డి చిల్లరగాడని.. అలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సారి కొడంగల్‌లో అతను ఓడిపోవడం ఖాయమని నాయిని జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5 లక్షలో, 10 లక్షలో కేసీఆర్‌ ఇస్తారన్నారనే బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nayani Narasimha Reddy
Revanth Reddy
Congress
Kodangal
KCR
  • Loading...

More Telugu News