raghuveera reddy: నాదెండ్ల మనోహర్ వి స్వార్థ రాజకీయాలు: రఘువీరా రెడ్డి

  • ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, స్పీకర్ పదవులను అనుభవించారు
  • మరికొన్ని రోజులు ఓపిక పట్టలేరా?
  • ఇందిర, ఎన్టీఆర్ లాంటి మహానేతలు కూడా అధికారానికి దూరంగా ఉన్నారు

కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరిన ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, స్పీకర్ పదవులను అనుభవించిన మనోహర్... కొన్ని రోజులు ఓపిక పట్టలేరా? అని ప్రశ్నించారు.

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి మహానేతలు కూడా ఓటమిపాలై అధికారానికి దూరంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మనోహర్ జనసేనలో చేరారని విమర్శించారు. మనోహర్ ను జనసేనలో చేర్చుకోవడం సరైంది కాదని అన్నారు. ఏపీలో ఎంపీ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయని చెప్పారు. అసెంబ్లీ ఓట్లను సాధించేందుకు కూడా తాము యత్నిస్తున్నామని తెలిపారు.

raghuveera reddy
nadendla manohar
janasena
  • Loading...

More Telugu News