nayanatara: నయనతార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే: దర్శకుడు బీటీ నందు

  • చాలా కాలం క్రితం శింబు, నయన్ ల జాతకాలను ఓ జ్యోతిష్కుడు పరిశీలించారు
  • పెళ్లి చేసుకుంటే నయన్ రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు
  • పెళ్లి చేసుకోకపోతే సీఎం అయ్యే అవకాశం ఉందని తెలిపారు

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు జీటీ నందు వెల్లడించారు. శింబు, నయనతారల ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత వారు విడిపోవడంపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయని... తనకు తెలిసిన ఓ కారణం కరెక్ట్ అయి ఉండవచ్చని ఆయన చెప్పారు. చాలా కాలం ముందు తాను, శింబు తరపున మరో వ్యక్తి ఒక జ్యోతిష్కుడిని కలిశామని... శింబు, నయన్ ల జాతకాలను సదరు జ్యోతిష్కుడు పరిశీలించారని తెలిపారు. నయనతారకు వివాహం అయితే ఆమె నడి రోడ్డున పడే అవకాశం ఉందని... పెళ్లి చేసుకోకపోతే ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని జ్యోతిష్కుడు చెప్పారని అన్నారు. నయన్ పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే సరైన కారణం అయి ఉండవచ్చని తెలిపారు.

nayanatara
simbu
bt nandu
  • Loading...

More Telugu News