meetoo: మీటూ ఆరోపణలన్నింటిలోనూ నిజం లేదు: సుసానే

  • మీటూను కొంత మంది స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు
  • కొంత మంది అబద్ధాలు చెబుతున్నారు
  • ఈ వేదికను సరైన మార్గంలోనే ఉపయోగించుకోవాలి

తాము ఎదుర్కొన్న లైంగిక దాడులను ఎంతో మంది మహిళలు మీటూ ఉద్యమం పేరుతో బయటపెడుతున్న సంగతి తెలిసిందే. బాధితురాళ్లకు ఎంతో మంది నుంచి మద్దతు లభిస్తోంది. అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ మాత్రం మీటూపై కొంచెం విరుద్ధంగా వ్యాఖ్యానించారు. మీటూ ద్వారా చేస్తున్న ఆరోపణలన్నింటిలో నిజం లేదని ఆమె తెలిపారు. కొంతమంది మీటూ ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

నిజానికి ఈ అంశంపై స్పందించాలని తాను అనుకోలేదని... కానీ, మీటూ పేరుతో కొంత మంది అబద్ధాలు చెబుతున్నారని, ఈ వేదికను చెడుకు ఉపయోగించుకుంటున్నారని, అందుకే తాను స్పందిస్తున్నానని చెప్పారు. ఈ వేదికను సరైన మార్గంలోనే ఉపయోగించుకోవాలని కోరారు. అబద్ధపు ఆరోపణలు చేయరాదని అన్నారు.

meetoo
sussanne khan
hrithik roshan
bollywood
  • Loading...

More Telugu News