nani: నాని జోడీగా మరో కథానాయిక .. రెబ్బా మోనికా జాన్

- క్రికెట్ నేపథ్యంలో సాగే 'జెర్సీ'
- మూడు డిఫరెంట్ లుక్స్ తో నాని
- రెబ్బా మోనికా జాన్ పరిచయం
నాని తన తదుపరి సినిమా అయిన 'జెర్సీ' చేయడానికి రెడీ అవుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాని మధ్య వయస్కుడిగాను .. వృద్ధుడిగాను కూడా కనిపించనున్నాడు.
