Pawan Kalyan: మోదీ నాకేం అన్న కాదు.. అమిత్ షా బాబాయ్ కాదు!:టీడీపీ నేతల విమర్శలపై పవన్ ఫైర్

  • బీజేపీలో నాకు బంధువులు కూడా లేరు
  • ఏపీ ప్రజల సంక్షేమం కోసమే జనసేన పెట్టా
  • మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్

తాను బీజేపీ నేతలతో కుమ్మక్కు అయినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ తనకేం అన్న కాదనీ, అమిత్ షా బాబాయి కూడా కాదని వ్యాఖ్యానించారు. కనీసం బీజేపీ నేతలతో తనకు బంధుత్వం కూడా లేదని తేల్చిచెప్పారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తాను జనసేనను స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఈ రోజు అమరావతిలో జనసేన ప్రధాన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఒక్కో సందర్భంలో ఒక్కో మాట చెబుతున్నారని పవన్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసమే తాను సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jana Sena
Special Category Status
amaracvati
  • Loading...

More Telugu News