petrol price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

  • లీటర్ పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల పెంపు
  • హైదరాబాద్ లో రూ.87కు చేరుకున్న పెట్రోల్
  • అల్లాడిపోతున్న సామాన్య ప్రజలు

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సామాన్యుడికి మరోసారి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే చమురు ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న వేళ ఈ రోజు లీటర్ పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ రూ.82.66కు చేరుకోగా, డీజిల్ రూ.75.19కి పెరిగింది. అలాగే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.87.63కు, డీజిల్ రూ.81.79కు చేరుకుంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.12కు, డీజిల్ ధర రూ. 78.82కు చేరుకుంది. ఓవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల పెట్రో ఉత్పత్తులపై రూ.2.5ను కేంద్రం తగ్గించినప్పటికీ రోజూ మారుతున్న ధరలతో వినియోగదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది.

petrol price
hike
diesel
fuel
doller
rupee
India
oil companies
  • Loading...

More Telugu News