ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణాదేవి
- ఎంతోమంది విద్వాంసులను దేశానికి అందించిన అన్నపూర్ణ
- పండిట్ రవిశంకర్ ఆమె భర్తే
తండ్రి బాబా అల్లావుద్దీన్ ఖాన్ వద్ద చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంలో ఓనమాలు దిద్దారు. ప్రముఖ సంగీత విద్వాంసులైన ఆశిష్ ఖాన్ (సరోద్), అమిత్ భట్టాచార్య (సరోద్), బహదూర్ ఖాన్ (సరోద్), బసంత్ కబ్రా (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (బన్సూరి) వంటి వారు అన్నపూర్ణాదేవి శిష్యులే కావడం గమనార్హం. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు శుభేంద్ర శంకర్ ఉన్నారు. 1992లో కుమారుడు మృతి చెందిన తర్వాత అన్నపూర్ణాదేవి రూషికుమార్ పాండ్యా అనే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన 2013లో మృతి చెందారు.